మన తెలుగులో చేసింది ఒక సినిమానే అయినా సరే రితిక సింగ్ కి వచ్చిన గుర్తింపు గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. రితిక సింగ్ తన నటన అందం అన్నీ కూడా చాలా బాగా చూపించడమే కాకుండా యువత తో పాటుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆమె విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆమె గురు సినిమాలో చేసిన పాత్రకు చాలా మంచి స్పందన వచ్చింది. ఆ సినిమాలో ఆమె మినహా ఎవరూ కూడా చేయలేరు అనే విధంగా చేసింది అని చెప్పాలి. ఆ సినిమాలో ఆమె కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఇప్పుడు ఆ నటనే మహేష్ బాబు ని ఆకట్టుకుంది అని అంటున్నారు. అవును ఆమె తో సినిమా చేయడానికి గానూ మహేష్ బాబు ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆయన ఆమెను తన సినిమాలో తీసుకోవడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇటీవలి కాలంలో ఆమెకు మహేష్ టీం ఫోన్ చేసి సర్కారు వారి పాట లో ఒక పాత్ర గురించి అడిగినట్టు సమాచారం. 

 

ఆ సినిమాలో ఆమె సిఎం కి చీఫ్ భద్రతా అధికారిగా నటించే ఆఫర్ మహేష్ నుంచి ఆమెకు వెళ్ళింది అని టాక్. మరి నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెకు ఫోన్ చేసిన వెంటనే ఆమె కూడా బాగానే డిమాండ్ చేసినా సరే ఆమెకు ఇవ్వడానికి రెడీ అయింది చిత్ర యూనిట్ అనే టాక్ వినపడుతుంది. త్వరలోనే ఆమె ఈ సినిమాలో నటించే విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. చూడాలి మరి ఎప్పుడు చేస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: