మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో బాగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటరైన మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తండ్రి ఇమేజ్ వాడకుండానే వచ్చాడని చెప్పాలి. పేదనాన్న మెగాస్టార్ చిరంజీవి ఉన్నా అది కొంతవరకే ఉపయోగపడుతుంది. కాని వరుణ్ కి అది కూడా అవసరం పడలేదని చెప్పాలి. ఇక మొదటి సినిమాతో హీరో మెటీరియల్ అనిపించుకొని ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకట్టుకున్నాడు. 

 

అయితే అందరిలాగా కమర్షియల్ సినిమాలు చేయాలి ...మాస్ హీరో అనిపించుకోవాలి అని తాపత్రయపడలేదు. ఎంచుకునే ప్రతీ సినిమాలో చాలా వైవిధ్యం చూపిస్తున్నాడు. కంచె, అంతరిక్షం, గద్దలకొండ గణేష్ సినిమాలే అందుకు ఉదాహరణ. ఇక మరోసారి వరుణ్ తేజ్ కొత్త తరహా కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకోసం శారీరకంగా చాలానే శ్రమిస్తున్నాడు. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో రూపొందే సినిమా కావడంతో అందుకోసం శిక్షణ తీసుకుంటూ భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకోసం తయారైన వరుణ్ తేజ్ మేకోవర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా మరో హిట్ వరుణ్ కి ఖాయం అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు.

 

అయితే చాలాకాలంగా ఈ సినిమాకి బాక్సర్ అన్న టైటిల్ ని చిత్ర బృందం అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. ఈ సినిమాలో వరుణ్ మేకోవర్ కి ఈ టైటిల్ పర్‌ఫెక్ట్ గా సూటయింది కూడా. కాని ఇప్పుడు ఈ టైటిల్ కాదంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ రెండు టైటిల్స్ కూడా పూరి జగన్నాధ్ రిజిస్టర్ చేయించి పెట్టుకున్నారట. విజయ్ దేవరకొండ తో పూరి తీస్తున్న సినిమాకోసం ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ చేసుకుంటాడని తెలుస్తుంది.

 

దాంతో ఏ టైటిల్ తన సినిమాకి పెట్టాలా అంటూ సందేహంలో పడ్డారట వరుణ్ టీం. అంతేకాదు పూరి వదిలేసిన టైటిల్ ని మనం పెట్టుకుందామన్న ఆలోచనలోను ఉన్నారట. కాని ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు టైటిల్స్ కాకుండా మీరు కొత్త టైటిల్ ని వెతుక్కోవచ్చుగా అంటూ సలహాలిస్తున్నారట. నిజమే మరి పూరి టైటిల్స్ కోసం చూడటమెందుకు ఫ్రెష్ టైటిల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా ...!   

మరింత సమాచారం తెలుసుకోండి: