ఒక్కసారి కన్ను గీటి ఇండియన్ సినిమాను తన వైపుకి తిప్పుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ కేరళ అమ్మాయి కోసం అప్పటి నుంచి కూడా కొన్ని భాషల్లో హీరోలు ఎదురు చూస్తున్నారు అనే ప్రచారం బాగానే జరుగుతూ వస్తుంది. ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి అని ఆమె సరిగా వాటిని వాడుకోవడం లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆమె మాత్రం  అన్ని భాషల్లో కూడా అవకాశాలు వస్తే మాత్రం మిస్ అవకుండా చెయ్యాలి అని చూస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాల్లో దక్షినాది లో ఓకే చేసింది. 

 

ఆమె చదువు కూడా పూర్తి కావడంతో ఆమె ఫ్యామిలీ కూడా ఆమెను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా సినిమాలను చేసుకునే విధంగా ముందుకు నడిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆమె తెలుగులో ఒక ఆఫర్ ని కొట్టేసింది అని టాక్. గోపి చంద్ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమె  త్వరలోనే నటించే అవకాశం ఉంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. పూరి దర్శకత్వంలో గోపి చంద్ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు అని ఆ ప్రాజెక్ట్ లో ఆమె ఉంది అని అంటున్నారు. 

 

ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అని సమాచారం. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన కూడా వస్తుంది అని చార్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు మరి. చూడాలి అది ఎంత వరకు నిజం అనేది. ఇప్పుడు ఆమె మలయాళం రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: