2020 సినిమా పరిశ్రమకు కరోనా దెబ్బ బాగా తగిలేలా ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవగా వాటిని ఎప్పుడు రిలీజ్ చేయాలా అన్న సందిగ్దత ఏర్పడింది. చిన్నాచితగా సినిమాలన్ని ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. స్టార్ సినిమాలు మాత్రం కొద్దిగా లేట్ అయినా సరే థియేటర్లు ఓపెన్ అయ్యాకనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నాని వి, రాం రెడ్ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ సినిమాలు రిలీజ్ అవ్వొచ్చని టాక్. ఇక మెగా మూవీస్ ఆచార్య, వకీల్ సాబ్ సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మే నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. పవన్ మరో వారం రోజులు షూటింగ్ కు వస్తే సినిమా పూర్తవుతుందట. స్టార్స్ ఇప్పుడప్పుడే షూటింగ్స్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వకీల్ సాబ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వస్తుందని ఆశించగా లేటెస్ట్ గా 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 2021 జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రకటించారు. సో ఈ లెక్కన ఆ సినిమా వాయిదా పడినట్టే.

 

ఇదేకాదు మెగాస్టార్ చిరంజీవి, కొరటల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా కూడా 2021 సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కాని తమ్ముడి కోసం అన్న త్యాగం చేసినట్టు తెలుస్తుంది. అందుకే అచార్యని 2021 సమ్మర్ కి రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. పవన్ కోసం చిరు ఈ మాత్రం సాయం చేయలేడా అనుకోవచ్చు. రీ ఎంట్రీ తర్వాత తనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతిని వదిలే ఆలోచన లేని చిరు పవర్ స్టార్ వకీల్ సాబ్ కోసం మాత్రం లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: