అను సితారా... ఈ పేరు పెద్దగా మన టాలీవుడ్ కి పరిచయం లేదు గాని ఈమెకు మలయాళం లో ఉన్న డిమాండ్ చాలానే చెప్తారు. ఆమెకు అక్కడ వరుస ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఆమె నటన తో పాటుగా ఆమె అందం గురించి అన్నీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె మలయాళం లో వరుసగా సినిమాలు చేస్తుంది ఇప్పుడు. అక్కడి అగ్ర హీరోలు అందరి తో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె చేసే పాత్రలు అన్నీ కూడా ఎక్కువగా చీర కట్టు తో మాత్రమే ఉంటాయి. ఆమె స్కిన్ షో చేయడం కూడా చాలా తక్కువ అని అంటూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమె స్కిన్ షో పెద్దగా చేసే అవకాశం ఉండదు అని అంటారు. 

 

ఇప్పుడు ఈ క్రమంలోనే ఆమెకు ఒక ఆఫర్ మన తెలుగు లో వచ్చింది అని సమాచారం. అవును ఆమె మహేష్ బాబుతో పాటుగా వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ తో ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని సమాచారం. నిజమా కాదా అనేది తెలియదు గాని ఒక సినిమాలో ఆమె వెంకటేష్ కి  భార్య గా నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పుడు ఈ సినిమాలకు సంభందించి హైదరాబాద్  కూడా వచ్చింది అని సమాచారం. 

 

ఆమెకు ఆఫర్ ఇవ్వడమే కాకుండా మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టారు దర్శక నిర్మాతలు అనే టాక్ వినపడుతుంది మరి. ఆమె ముందు చేయలేను అని చెప్పినా సరే ఆమెనే కావాలని అడిగారట. చూడాలి మరి ఆమె ఇక్కడ ఎన్ని సినిమాలు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: