టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోల సినిమాల కోసం ఇప్పుడు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన తెలుగులో... అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గా వస్తున్న నేపధ్యంలో కథ నుంచి నటీ నటుల ప్రకటన వరకు అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి అని చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఇప్పుడు నటులు ఎవరు అనేది అందరికి ఆసక్తి. ఇక ఇప్పుడు మన తెలుగులో నటుల విషయంలో ఖర్చు తగ్గించే ఆలోచనలో హీరోలు దర్శక నిర్మాతలు ఉన్నారు అని ప్రచారం బాగా జరుగుతుంది. 

 

విలన్ పాత్రలకు ఇప్పుడు ఎంపిక చేసే వారిని ఇతర భాషల నుంచి వద్దు అని ఇక్కడి వారినే ఎంపిక చేసుకోవడం మంచిది అనే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ఇతర భాషల వారి వెంటపడితే ఇప్పుడు వాళ్ళు అడిగిన విధంగా ఇవ్వాలి అని అదే ఇక్కడి వారు అయితే మాత్రం ఆ సమస్య అసలు ఉండదు అని భావిస్తున్నట్టు టాక్. ఇప్పుడు మహేష్ బాబు సినిమా అయినా శర్వానంద్ సినిమా అయినా సరే తెలుగు లో ఆదరణ లేకుండా ఉన్న పాత నటులను ఎంపిక చేసుకోవాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఆశిష్ విద్యార్ధి షియాజీ షిండే సహా కొందరు నటులకు ఇప్పుడు మళ్ళీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అగ్ర హీరోల సినిమాల్లో వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని విలన్ పాత్రల విషయంలో మాత్రం ఇప్పుడు అసలు ఇతర భాషల వెంట అసలు వద్దు అని చెప్తున్నారు అని తెలుస్తుంది. మరి ది ఎంత వరకు ఫలిస్తుంది కమర్షియల్ సినిమాలకు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: