టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ టైమ్ లోనే అదిరిపోయే హిట్లు ఇవ్వటంలో ముందుండే  డైరెక్టర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. సినిమా ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్లు అని చెప్పుకునే వారు సంవత్సరాలు తరబడి నెలల తరబడి సినిమాలు చేసి హిట్లు కొడితే ఒక పూరి జగన్నాథ్ మాత్రం అతి తక్కువ టైమ్ లోనే సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు తిరగరాయడం అందరికీ తెలిసిందే. 

 

అటువంటి పూరి జగన్నాథ్ కి ప్రభాస్ సొంత బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ సంస్థలో ఓ వెబ్ సిరీస్ తక్కువ టైమ్ లోనే చేయించి ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ఇప్పటికే వాటికి సంబంధించి డార్లింగ్ ప్రభాస్ పూరి జగన్నాథ్ తో మంతనాలు జరిపినట్లు భారీ అమౌంట్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు… నిర్మాతగా బ్యాక్ ఎండ్ తానే ఉండటంతో పూరి జగన్నాథ్ కి ప్రభాస్ ఎటువంటి కండిషన్స్ పెట్ట లేదట. పైగా పూర్తి స్వేచ్ఛ ఇస్తూ  స్క్రిప్ట్ దగ్గరనుంచి నటీనటులు, వెబ్ సీరీస్ బడ్జెట్ ఇలా మొత్తం ఆయనకి ఇష్టం వచ్చినవే సెలక్ట్ చేసుకోమన్నారట. దీంతో పూరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

 

కాగా ప్రజెంట్ పూరి జగన్నాథ్....విజయ్ దేవరకొండ తో 'ఫైటర్' అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. పైగా ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ దాదాపు మూడు నెలలకు పైగా షూటింగ్ జరపడం లేదు, లేకపోయి ఉంటే ఈ పాటికి వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ చేతిలో రెండు అతి పెద్ద ప్రాజెక్టులు ఉండటంతో .. ప్రభాస్ వెబ్ సిరీస్ విషయంలో పూరి జగన్నాథ్ కొద్దిగా ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: