ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. అలాగే, ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో బుధవారం ఏపీలోని ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి

 

అలాగే కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో నైఋతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది. దీంతో రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది

 

రోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందినైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. భారీవర్షాలతో పాటు కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలు వీయనున్నాయి.

 

ఇంకా తూర్పు మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకొని, తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బలపడనుందని విశాఖ వాతావరణశాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావం వలన కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన కారణంగా రెండు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా  ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: