టాలీవుడ్ జనాలు కొందరు హీరోయిన్ లను ఎప్పటికి మర్చిపోయే అవకాశం ఉండదు. వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళ నటన జనాలకు ఏదోక సందర్భంలో గుర్తుకు వస్తూనే ఉంటుంది. వాళ్ళ సినిమాల్లో వాళ్ళు పోషించిన పాత్రలు అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక టాలీవుడ్ లో సౌందర్య గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆమె పోషించిన పాత్రలు ఆమె చేసిన సినిమాలు ఎవరూ కూడా చేయలేదు అనే చెప్పాలి. అటు మాస్ కి ఇటు క్లాస్ కి కూడా ఆకట్టుకునే విధంగా ఆమె సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే... 

 

పవిత్ర బంధం సినిమాలో ఆమె వెంకటేష్ కి భార్య గా నటించారు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర చూసి చాలా మంది షాక్ అయ్యారు. అంత అందంగా ఒక భార్య భర్తను ప్రేమిస్తుందా అంటూ సినిమా చూసి వచ్చి కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పట్లో. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆమె పాత్ర ఎప్పటికి కూడా ఆ సినిమాలో హైలెట్ గానే ఉంటుంది అని చెప్పాలి. ఇక భార్యగా ఆమె చాలా అందంగా నటించడమే కాదు ఎవరూ చేయలేరు అనే విధంగా జీవించింది ఆ పాత్రలో అని చెప్పాలి. 

 

అక్కడి నుంచి ఆమెకు డిమాండ్ బాగా పెరిగింది. అగ్ర దర్శక నిర్మాతలు ఆమె తో సినిమా చేయడానికి గానూ ఎంతో ఆసక్తి చూపించారు అప్పట్లో. ఆ విధంగా ఆమె పాపులర్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆమె భార్య పాత్రలు పోషిస్తూ వచ్చారు. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి అనే చెప్పాలి. ఆమె వెంకటేష్ పక్కన భార్యగా సరిగా సరిపోయారు అని అంటారు సిని ప్రియులు.

మరింత సమాచారం తెలుసుకోండి: