మన తెలుగులో చాలా వరకు స్టార్ హీరోల పక్కన కొందరు హీరోయిన్ లు అయితేనే సరిపోయే అవకాశం ఉంటుంది. అగ్ర హీరోల పక్కన అగ్ర హీరోయిన్ లు అయితేనే ఏ పాత్ర లో అయినా సరే జీవించే అవకాశం ఉంటుంది. అందులో సౌందర్య ఒకరు. ఏ పాత్రలో అయినా సరే జీవిస్తారు అనే పేరు ఆమె సొంతం. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు కి భార్య గా ఆమె నటించింది. ఆ పాత్ర ఏ రేంజ్ లో హిట్ అయింది అంటే ఆ పాత్రలో ఆమె మినహా ఎవరూ చేయలేరు అసలు చేసినా సరే అంత అందం రాదు అనే విధంగా ఆ పాత్ర హిట్ అయింది అని చెప్పాలి. 

 

సినిమా తర్వాత ఆమె రేంజ్ ఏ స్థాయిలో పెరిగింది అంటే ఆమె చేసే సినిమాల కోసం మహిళా అభిమానులు ఎదురు చూసే రేంజ్ లో ఆమె క్రేజ్ పెరిగింది అని చెప్పాలి. మోహన్ బాబు తో పాటుగా వెంకటేష్ చిరంజీవి వంటి హీరోలకు ఆమె భార్యగా నటించారు. ఆ పాత్రలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకునే విధంగా చేసారు. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పక్కన ఆమె భార్యగా చాలా అందంగా నటించారు. రియల్ లైఫ్ లో భార్యగానే కనిపించారు ఆమె ఆ సినిమాలో. 

 

ఆమె పాత్రను అసలు దర్శకుడు తీర్చిదిద్దిన విధానం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. ఆ పాత్రకు ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది అప్పట్లో అని అంటారు. ఆమె సినిమాల కోసం మహిళా ప్రేక్షకులు అక్కడి నుంచే ఎదురు చూసారు. ఆమె కూడా చాలా వరకు మంచి పాత్రలు పోషించి తన నటన తో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: