టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే రాధికా ఆప్టే కి వచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె సినిమాలు పెద్దగా లేవు గాని ఆమె పోషించిన పాత్రలు వాటికి వచ్చిన విమర్శలు సహా ఆమె చేసిన విమర్శలు అన్నీ కూడా ఒక సంచలనం. ఆమె పోషించిన పాత్రల పై ఆమె అసహనం వ్యక్తం చేసుకుని వాటిని విమర్శించుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూ వచ్చాం. తెలుగు లో దర్శక నిర్మాతలకు హీరోలు మాత్రమే కనపడతారు అంటూ ఆమె చేసిన విమర్శలు ఒక సంచలనంగా మారాయి అనే చెప్పాలి. 

 

దర్శక నిర్మాతలు చాలా మంది ఆమెను అందుకే పక్కన పెట్టారు. తెలుగు లో హీరోలను మాత్రమే చూస్తారు అంటూ విమర్శలు చేసారు ఆమె. ఇక రక్త చరిత్ర సినిమాలో ఆమె వివేక్ ఒబెరాయ్ కి భార్యగా నటించారు. పరిటాల సునీత పాత్రలో ఆమె కనిపించారు. పరిటాల రవి పాత్రలో వివేక్ కనిపించారు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడం తో ఆమె పేరు బాగానే వినిపించి ఆ తర్వాత మూడు నాలుగు సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. బాలయ్య లెజెండ్ సినిమాలో ఆమెకు అదే విధంగా ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఆమె తనకు వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోలేదు అని చాలా మంది అంటారు. నటన పరంగా ఆమెకు మంచి మార్కులే వేసారు దర్శక నిర్మాతలు. కాని ఆమె మాత్రం దానిని కాపాడుకోలేక అవస్థలు పడింది. టాలీవుడ్ లో హీరోల మీద విమర్శలు చేయడంతో పక్కన పెట్టారు. లెజెండ్ లో ఆమె బాలయ్యకు భార్య గా కూడా కనిపించారు గాని అది ఎక్కువ సేపు కాదు. అలా ఆమె తన మార్క్ వేసుకున్నా సరే పేరు ని మాత్రం కాపాడుకోలేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: