మన తెలుగులో కొందరు హీరోయిన్ లను అసలు మర్చిపోయే అవకాశం ఉండదు. వాళ్ళు చేసే పాత్రలు వారి నటన అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అగ్ర హీరోల సినిమాల్లో వాళ్ళు చేసిన పాత్రలను అసలు మర్చిపోయే అవకాశం ఉండదు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్... రమ్యకృష్ణ. ఆమె చేసిన పాత్రలు ఆమెకు వచ్చిన ఇమేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అగ్ర హీరోల సినిమాల్లో తాను మినహా ఎవరూ సెట్ అయ్యే అవకాశం లేదు అనే విధంగా ఆమె నటించారు అనే చెప్పాలి. 

 

ఇక మన తెలుగు లో స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఉంటే సినిమాకు ఒక రేంజ్ వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు. ఇక అది పక్కన పెడితే ఆమె కొన్ని కొన్ని సినిమాల్లో చాలా అందమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు భార్యగా ఆమె నటించారు. ఆ పాత్రలు చాలా బాగా హిట్ అయ్యాయి అనే చెప్పాలి. మోహన్ బాబు కి భార్యగా ఆమె అసెంబ్లీ రౌడి సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా విజయం సాధించింది. ఆమె పాత్రకు మంచి మార్కులు పడటం తో అగ్ర దర్శక నిర్మాతలు అలాంటి సవాల్ ఉన్న పాత్రలు కావాలి అంటే ఆమెను అడిగే విధంగా ఉంది. 

 

ఇక అక్కడి నుంచి ఆమె కూడా చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేసారు అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆమె సినిమాల్లో చాలా అందమైన పాత్రలు పోషిస్తున్నారు. ఆమె పాత్రలకు మంచి డిమాండ్ ఉంటుంది. బాహుబలి సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే నరసింహ సినిమాలో ఆమె చేసిన విలన్ పాత్ర ఒక సంచలనం అని సినిమా చూసిన ఎవరు అయినా చెప్పే మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: