మన తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే కొన్ని కొన్ని పాత్రలతో అందరికి గుర్తు ఉండిపోయారు స్నేహ. ఆమె కొందరు స్టార్ హీరోలకు భార్యగా నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నాగార్జున సినిమాలో ఆమె చేసిన ఒక భార్య పాత్ర ఒక సంచలనం. శ్రీరామదాసు అనే భక్తిరసా చిత్రం లో ఆమె నాగ్ కి భార్య గా నటించారు. ఆ పాత్ర సూపర్ హిట్ అయింది. ఆమె భర్త కోసం ఎదురు చూసే భార్యగా... భర్త కష్టాలను చూసి ఆమె  నరకం చూస్తూ ఆ నరకాన్ని స్క్రీన్ మీద ఆమె చూపించిన విధానం అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. 

 

ఆ పాత్రలో ఆమె జీవించారు అనే చెప్పవచ్చు. ఆ పాత్ర తర్వాత... ఆమెకు మంచి డిమాండ్ వచ్చింది గాని స్టార్ హీరోల తో సినిమాలు చేసే అవకాశాలు వచ్చిన సమయంలో ఆమె అనవసరంగా టాలీవుడ్ కి దూరం అయింది అని అంటారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టింది. ఇక ఆ సినిమాలో నాగార్జున కు భార్యగా ఆమె మినహా ఎవరూ కూడా సెట్ అయ్యే అవకాశం లేదు అనే విధంగా నటించారు అనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు ఆ సినిమా టీవీ లో వచ్చినా సరే ఎవరూ కూడా అవ్వకుండా చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆమె మంచి పాత్రలు ఉంటే చేయడానికి రెడీ గా ఉంటున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో మంచి పాత్రలు వస్తే మాత్రం కచ్చితంగా చేస్తున్నారు. అసలు ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు పారితోషికం విషయంలో కూడా. అగ్ర హీరోలు ఆమె అవసరం ఉన్న నేపధ్యంలో తీసుకుని చేయిస్తున్నారు సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: