టాలీవుడ్ లో ఈ తరంలో ఏ పాత్రకు అయినా సరే సరిగా సరిపోయే హీరోయిన్... నయనతార. ఏ పాత్రలో అయినా సరే ఆమె కచ్చితంగా జీవిస్తుంది అని ఆమె సినిమాలు చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆమె నటన గాని ఆమె పోషించే పాత్రలు గాని యువతలో బాగా వెళ్తూ ఉంటాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమె కొన్ని కొన్ని సినిమాల్లో భార్య పాత్రలకు సరిగా సరిపోతున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చాలా వరకు భార్య పాత్రలు పోషించారు. 

 

సింహ సినిమాలో బాలయ్య కు భార్యగా నటించారు ఆమె. అదే విధంగా వెంకటేష్ తులసి సినిమాలో ఆమె భార్యగా నటించారు. అలాగే... చిరంజీవి హీరో గా వచ్చిన సైరా సినిమాలో కూడా ఆమె భార్య పాత్రలో నటించి మెప్పించారు. ఇక వెంకటేష్ భార్య గా మాత్రం ఆమె సరిగా సెట్ అయ్యారు అని అంటారు. ఇక బాలయ్య భార్యగా కూడా ఆమెకు మంచి పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. స్టార్ హీరోల  సినిమాల్లో ఈ తరం విషయానికి వస్తే ఆమె మాత్రం సరిగా సరిపోయే హీరోయిన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఇప్పుడు ఆమె తమిళం లో రెండు  మూడు సినిమాల్లో చేస్తున్నారు. తెలుగు లో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే చెప్పాలి. ఎందుకు ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని చిరంజీవి ఆచార్య సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చినా సరే ఆమె అంతగా ఆసక్తి చూపించలేదు అని టాలీవుడ్ లో టాక్. దీని తోనే మరో హీరోయిన్ ని ఆమె స్థానం లో చూసారు అని టాలీవుడ్ లో అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: