తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన రాజమౌళి ‘బాహుబలి’ ఒక చరిత్ర. ఆ సినిమాను ప్రశంసించేవారు తప్ప దాని పై విమర్శలు చేసేవారు పెద్దగా  కనిపించరు. ప్రస్తుతం జనాన్ని కుదిపేస్తున్న కరోనా ఏకంగా ‘బాహుబలి’ పై కొందరు సెటైర్ వేసేలా చేసింది.


కరోనా సమస్య మన జీవితంలో ఒక భాగం అని తేలిపోవడంతో సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు కరోనా తో సహజీవనం చేయడానికి మానసికంగా సిద్దపడిపోతున్నారు. దీనితో మన అలవాట్లలో మన జీవన శైలిలో ఎన్నోమార్పులు వచ్చాయి. ఆఖరికి జనం ఎంతో ఇష్టపడి చూసే సినిమాల మేకింగ్ లో కూడ కరోనా అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకు రాబోతోంది.


ఈ పరిస్టితులను పరిగణలోకి తీసుకుని ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోకి సంబంధించిన కొందరు ఉత్సాహవంతులు ‘బాహుబలి’ లో భల్లాలదేవా  బాహుబలిలు తలపడే ఒక పోరాట సన్నివేశానికి సంబంధించిన విజువల్ లో ప్రభాస్ రానా ముఖాలకు మాస్క్ లు పెట్టి ఇప్పుడు బాహులి ని తీసి ఉంటే ఇలా తీయవలసి వచ్చి ఉండేది అని కామెంట్స్ చేస్తూ ప్రభాస్ రానా ముఖాలకు మాస్క్ లు పెట్టిన ఫోటోలను షేర్ చేసారు. ఇలా క్రియేట్ చేసిన ఫోటో రాజమౌళి దృష్టి వరకు వెళ్ళడంతో ఈ జోక్ ను రాజమౌళి చాల సరదాగా తీసుకుని కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


“Good job @avitoonindia and @coollazz #Unitedsoft VFX Studio team! #BBVsCOVID #IndiaFightsCorona #StaySafe.” అంటూ రాజమౌళి ఈ ప్రయత్నాన్ని అభినందించడం ఆయన హాస్య ప్రియత్వాన్ని సూచిస్తోంది. కరోనా సమస్యలు ప్రారంభం అయ్యాక ఎన్నో జోక్ లు మీడియాలో హడావిడి చేసినా ఇప్పుడు ఏకంగా ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ క్రియేట్ చేయబడ్డ ఈ జోక్ నిన్నటి సోషల్ మీడియాకు హాట్ న్యూస్ గా మారడమే కాకుండా అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: