ప్రస్థుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న కరోనా సగటు మనుషులతో పాటు సెలెబ్రెటీలను విపరీతంగా కలవర పెడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈవ్యతిరేక పరిస్థితులను ఎదిరించి షూటింగ్ లు కొనసాగించాలి అని రకరకాల ఆలోచనలు చేస్తున్న ఇండస్ట్రీ వర్గాలకు లేటెస్ట్ గా బండ్ల గణేష్ విడుదలచేసిన ఒక మీడియా ప్రకటన ఇండస్ట్రీ వర్గాలను ఆలోచనలలో పడేయడమే కాకుండా షూటింగ్ లు కొనసాగించాలి అని ఆలోచనలు చేస్తున్న అనేకమంది దర్శక నిర్మాతలను  హీరోలను ఎలర్ట్ చేసే విధంగా ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.


బండ్ల గణేష్ తనకు కరోనా వచ్చిన తరువాత మొదటిసారిగా తన స్పందన తెలియచేస్తూ ఎవరు ఊహించని అభిప్రాయాలను షేర్ చేసాడు. తాను ప్రస్తుతం తన ఇంటిలోనే మ్యూజిక్ వింటూ యోగా చేస్తూ తనకు వచ్చిన కరోనా సమస్య నుండి బయటపడటానికి మందులు వేసుకుంటూ హోమ్ క్వారెంటైన్ లో ఉన్న విషయాన్ని తెలియచేసాడు.


తనకు కరోనా తన జీవితానికి సంబంధించి జ్ఞానోదయాన్ని కల్గించింది అని చెపుతూ ‘డబ్బు కీర్తి’ ఏవీ శాస్వితం కావు అన్నవిషయం తనకు తెలిసి వచ్చిందని ఆరోగ్యం ఎంత ముఖ్యమో తనకు కరోనా తెలిసి వచ్చేలా చేసింది అని కామెంట్స్ చేసాడు. తన 46 ఏళ్ల జీవితంలో తాను ఇప్పటి వరకు ఏ విషయం గురించి భయపడలేదనీ అయితే తనను కరోనా విపరీతంగా భయపెట్టింది అని అంటున్నాడు.


ప్రస్తుతం బండ్ల గణేష్ షేర్ చేసిన ఈ మెసేజ్ ఏకంగా రాజమౌళి లాంటి మొండిపట్టుదల ఎక్కువగా ఉండే వ్యక్తుల పై కూడ ప్రభావితం చేసి అప్పటి వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు అయినా కొనసాగిస్తాను అని చెపుతూ వచ్చిన జక్కన్న తన ఆలోచనలు మార్చుకుని ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్ వాయిదా వేయడం వెనుక బండ్ల గణేష్ పడుతున్న భయం బాగా ప్రభావితం చేసింది అని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: