ఇప్పుడు ఆచార్య సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ని పెంచుతుంది. చిరంజీవి ఈ సినిమాలో పోషించే పాత్రే దానికి కారణం. పాత్ర ఏ విధంగా ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉంటుంది అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా విషయంలో చిరంజీవి తీసుకునే జాగ్రత్తలు రామ్ చరణ్ తీసుకునే జాగ్రత్తలు దర్శకుడు కొరటాల శివ ప్రతీ ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా రాజీ అనేది లేకుండా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళారు. 

 

అయితే సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్ర౦ అసలు స్పష్టత అనేది రావడం లేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రధానంగా చిరంజీవి పోషించే పాత్రపైనే చర్చలు అన్నీ కూడా నడుస్తున్నాయి అని చెప్పాలి. అగ్ర హీరోల్లో ఇప్పుడు సీనియర్  హీరో గా చిరంజీవి కి చాలా మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి. దీనితో ఇప్పుడు ఈ సినిమా విషయంలో టాలీవుడ్ జనాలు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చిరంజీవిసినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలను పక్కాగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన చేసే సినిమా విషయంలో ఇప్పుడు అసలు దృష్టి పెట్టడం లేదు అని అంటున్నారు. 

 

అవును ఆయనకు రెండు మూడు కథలను రామ్ చరణ్ ఇటీవల వినిపించే ప్రయత్నం చేసినా సరే ఆయన మాత్రం అసలు వినడం లేదు అని వార్తలు వస్తున్నాయి మరి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని అసలు ఆయన ఏ కథ కూడా వినడం లేదు అని అంటున్నారు టాలీవుడ్ లో.

మరింత సమాచారం తెలుసుకోండి: