ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు వస్తుందా అనేది జనాల ఆసక్తి. ఈ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఏ విధంగా నటిస్తారు అనే ఆసక్తి అందరి లో కూడా ఉంది అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రధానంగా  రామ్ చరణ్ ఎన్టీఆర్ మీదనే అందరి దృష్టి కూడా ఉంది అని చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించే అవకాశం ఉంది బాలకృష్ణ కనిపించే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా చాలా మంది చేసారు గాని అది నిజం కాదు అని తెలిసింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని కొన్ని వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి అనే చెప్పాలి. 

 

అసలు ఆ వార్తలు ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ లను మార్చేయడం ఖాయమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును హీరోయిన్ లను దాదాపుగా మార్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలియా భట్ మోరిస్ ఇద్దరూ కూడా షూటింగ్ కి వచ్చే అవకాశం లేదు అని అందుకే వారు ఇద్దరినీ మార్చేయడం ఖాయమని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది మరి. వారి విషయంలో ఇప్పుడు దర్శకుడు రాజమౌళి ఆలోచనలో పడ్డాడు అని సమాచారం. వారు ఇద్దరినీ కూడా ఎలా అయినా మార్చడమే మంచిది అని భావిస్తున్నాడట. 

 

ఇప్పుడు రాజమౌళి దీని మీదనే దృష్టి పెట్టి జాన్వీ కపూర్ ని అలాగే మరొక తమిళ హీరోయిన్ ని అడిగారు అని సమాచారం. ఆమె కూడా నటించడానికి రెడీ అయ్యారు అని టాక్. వాళ్ళ కోసం ఎదురు చూస్తే సినిమా బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని జక్కన్న భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: