ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ చేసే సినిమా త్రివిక్రమ్ తో. ఈ సినిమా విషయంలో ఇప్పుడు అనేక చర్చలు. తారక్ పాత్ర ఏ విధంగా ఉంటుంది అతను ఏ విధంగా నటిస్తాడు అనే దాని మీద అనేక వార్తలు వస్తున్నాయి గాని అతను అసలు ఏ పాత్ర చేస్తాడు అనే దాని మీద దర్శక నిర్మాతలు అసలు ఇప్పటి వరకు ఏ విధంగా కూడా స్పష్టత అనేది ఇవ్వలేదు. ఇప్పుడు అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అటు బాలీవుడ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. బన్సాలి తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ ఎక్కువగా వినపడుతుంది. 

 

టాలీవుడ్ జనాలు చాలా వరకు కూడా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గురించే ఎదురు చూస్తున్నారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ సినిమా తర్వాతే అతని సినిమాల గురించి ఆలోచన చేసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతను చాలా వరకు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి లో ఉన్నాడు అని జనాలు అంటున్నారు. అవును ఇప్పుడు ఆయనకు అసలు ఏ సినిమా ఓకే చెయ్యాలో అర్ధం కావడం లేదట. ఆర్ఆర్ఆర్ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది కూడా విడుదల కష్టమే. 

 

ఇక త్రివిక్రమ్ సినిమాలో అతను నటించాలి అంటే ఈ సినిమా కచ్చితంగా పూర్తి అవ్వాలి. ఈ సినిమా పూర్తి అయ్యే వరకు కూడా అతను మరో సినిమాను ఓకే చేసే అవకాశం లేదు కాబట్టి త్రివిక్రమ్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. నానీ తో లేదా రామ్ చరణ్ తో సినిమా అంటున్నాడు. అందుకే ఇప్పుడు అసలు ఎన్టీఆర్ ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: