‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో అనేక కీలక పాత్రలలో విదేశీ నటీనటులు నటిస్తున్నారు. ముఖ్యంగా ఈమూవీలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఒక విదేశీ హీరోయిన్ ను వెతకడానికి రాజమౌళి చాల కష్టపడ్డాడు. మొదట్లో ఈపాత్రకు ఎంపిక అయిన బ్రిటన్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈమూవీ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో అనేక ప్రయత్నాలు చేసి రాజమౌళి ఎమ్మా రాబర్ట్స్ ను ఫిక్స్ చేసాడు. 


అయితే ఈమె ఈమూవీ నుంచి కూడ పూర్తిగా తప్పుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం ఈమె త్వరలో తల్లి కాబోతోంది. ఎమ్మా రాబర్ట్స్ గ్యారెట్ అనే సహ నటుడుతో సహజీవనం కొనసాగిస్తోంది. వారిద్దరికీ పెళ్లి అవ్వకపోయినా తాను తల్లి కాబోతున్నాను అంటూ ఎమ్మా ఇచ్చిన లీకులకు ఆమె తల్లి కెల్లీ కూడ ఒక బ్రిటీష్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తను ఖరార్ చేయడంతో రాజమౌళి బ్రిటీష్ హీరోయిన్ తల్లి కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. 


దీనితో ఈమె విషయంలో రాజమౌళికి కొత్త తలనొప్పులు ప్రారంభం అవ్వడం ఖాయం. ప్రస్తుత పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కొనసాగించే స్థితి లేకపోయినా తిరిగి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మొదలయ్యే సమయానికి ఎమ్మా లుక్ అంతా ఆమె గర్భం వల్ల చాల తేడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. 


దీనితో ఈమె స్థానంలో మరొక హీరోయిన్ ఈ బ్రిటీష్ బ్యూటీ పాత్ర కోసం వెతకవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితులలో మరొక ఫారెన్ హీరోయిన్ వెతకడం రాజమౌళికి సాధ్యంకాని పని. దీనితో ఈపాత్రను బాలీవుడ్ కు చెందిన ఎవరో ఒకరు పాపులర్ హీరోయిన్ తో చేయించే ఆస్కారం ఉంది. జక్కన్న ఏ ముహూర్తాన ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రారంభించాడో తెలియదుకాని ‘ఆర్ ఆర్ ఆర్’ కు అన్నీ సమస్యలే..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: