టాలీవుడ్ లో నితిన్ కి మంచి ఇమేజ్ ఉంది. అతని సినిమాలు ఒకప్పుడు జనాలకు  పెద్దగా నచ్చలేదు గాని ఇప్పుడు మాత్రం బాగానే నచ్చుతున్నాయి అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల కంటే కూడా అతని సినిమాలను చూడటానికి జనాలు ఇప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కథ లో కాస్త అర్ధం ఉండటమే కాకుండా ఓ భారీగా  యాక్షన్ సన్నివేశాలు లేకుండా సినిమాలు చేయడం నితిన్ కి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇప్పుడు అతని చేతిలో ఒక సినిమా ఉంది. ఈ సినిమా తర్వాత  తమిళ సినిమాలో అతను నటించే అవకాశం ఉంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను పవన్ సినిమాలో 5 నిమిషాల పాత్ర ఒకటి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని క్రిష్ పవన్ సినిమాలో అతను నటించే పాత్ర ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అతను చేసే సినిమాల విషయంలో జనాలకు ఎప్పుడు లేని ఆసక్తి ఉంది. ఇప్పుడు అతను మాత్రం కాస్త ఎక్కువగా హీరోగానే కాకుండా ఇతర పాత్రల మీద కూడా కాస్త ఫోకస్ చేసారు అని అంటున్నారు మరి. దానికి కారణం తన సినిమాలకు మార్కెట్ ని భారీగా పెంచుకోవడమే అని టాలీవుడ్ లో టాక్. 

 

అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలో అతను నటించడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అని జనాలు అంటున్నారు. ఇప్పుడు అతని చేతిలో ఉన్న సినిమాలు అయిన తర్వాత ఆ సినిమాలో నటించే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ రీమేక్ సినిమా ఒకటి కూడా నితిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి అతని ప్లాన్ ఏ విధంగా విజయవంతం అవుతుంది అనేది. నిర్మాత గా కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: