శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కు ఎన్నో అవకాశాలు వచ్చినా తనకు నచ్చిన సినిమాలను మాత్రమే జాన్వీ ఎంచుకుంటోంది. తన నటనకు అవకాశం ఉన్న పాత్రల వైపు జాన్వీ అనుసరిస్తున్న వ్యూహాలు ఆమె ఇండస్ట్రీలో చాలకాలం కొనసాగుతుంది అన్నసంకేతాలు ఇస్తోంది.


ఈ పరిస్థితుల మధ్య ఆమె లేటెస్ట్ మూవీ ‘గుంజన్ సక్సేనా’ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 70 కోట్లకు దక్కించుకున్నట్లుగా వస్తున్న వార్తలు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ఈ సినిమా తీయడానికి ఈ మూవీ నిర్మాతలకు 30 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని తెలుస్తోంది.


కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా యొక్క పాత్రలో జాన్వీ నటించడానికి చాల కష్టపడింది. ముఖ్యంగా ఆర్మీలో పనిచేసే అనేకమంది మహిళా ఆర్మీ ఆఫీసర్ లు దగ్గరకు వెళ్ళి జాన్వీ ఆర్మీ పద్ధతుల గురించి ముఖ్యంగా యుద్ధంలో వారు ప్రవర్తించే తీరు గురించి అప్పుడు ఏర్పడే భావోద్వేగాల గురించి జాన్వీ చాల పెద్ద హోమ్ వర్క్ చేసింది.


భారతదేశపు మొట్టమొదటి మహిళా పోరాట ఏవియేటర్ల పై 1999 ఎన్డిటివి నివేదిక ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. శరణ్ శర్మ నిఖిల్ మెహ్రోత్రా కలిసి నిర్మించిన ఈ చిత్రంలో వినీత్ కుమార్ మానవ్ విజ్ కూడా నటించారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకున్నారు. ఆతరువాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. అయితే కరోనా సమస్యతో కరోనాతో ధియేటర్లు మూత పడటంతో ఈ మూవీ విడుదలకు దార్లు మూసుకు పోయాయి. దీనితో ఈమూవీ నిర్మాతలు ఒటీటీ ప్లాట్ ఫామ్ పై ఈ సినిమాను విడుదల చేయాలని చేసిన ప్రయత్నాలకు ఏకంగా నెట్ ఫ్లిక్స్ 70 కోట్ల భారీ మొత్తానికి కొనడంతో ఈ సినిమా ధియేటర్లలలో విడుదల అవ్వకపోయినా జాన్వీ క్రేజ్ తో నిర్మాతలకు కోట్లు కురిపించింది..   

మరింత సమాచారం తెలుసుకోండి: