తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది కొన్ని  పాత్రలకు మాత్రమే అంకితం అయితే... ఇంకొంత మంది మాత్రం ఓ వైపు తన గ్లామర్తో సినీ ప్రేక్షకులు అందరిలో హీట్ పుట్టిస్తోనే... తన అభినయంతో ఎంతోమందిని మెస్మరైజ్  చేస్తూ... ఎన్నో వైవిధ్యమైన పాత్రలో తన నటన తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ వుంటారు.




 ఇలా ఇప్పటి వరకూ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించడంతో పాటు తన గ్లామర్ తో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీయ. అప్పట్లో శ్రీయ అందాలకు ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు అనడంలో అతిశయోక్తి లేదు. తన కోర  చూపులతో హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక పెళ్లి తర్వాత కూడా ఎక్కడ ఈ అమ్మడు అందాల ఆరబోత లో వెనకడుగు వేయడం లేదు. ఇదిలా ఉంటే చాలా మంది హీరోయిన్లు హీరోలకి భార్య పాత్రలో నటించడం చూస్తూ ఉంటాం, కానీ కొంతమందికి మాత్రమే ఇలా భార్య పాత్రలో సెట్ అవుతూ ఉంటారు.



ఇలా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన భార్య గా నటించిన శ్రేయ తన హావభావాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి. ఒక యుద్ధ వీరుడు కి భార్య గా ఉన్న శ్రేయ... ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా ఉంటూ భర్తకు వెన్ను తడుతూనే ఉంటుంది. లోలోపల యుద్ధానికి వెళ్లినప్పుడు తన భర్తకు ఏమవుతుందో అనే బాధ మనసును తొలిచి వేస్తున్నప్పటికీ... అది బయటకు కనిపించకుండా భర్త కు  విజయం ప్రాప్తించాలని ఎంతో ధైర్యంగా యుద్ధానికి సాగనంపే పాత్రలో శ్రియ అభినయం నిజంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అని చెప్పాలి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: