సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు హీరోలకు భార్య పాత్రలు చేయడం లేదా పెళ్ళైన మహిళ పాత్రలో నటించడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్ళైన మహిళ గా నటిస్తే తమకు ఆ తర్వాత ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయని భయపడిపోతుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు నయనతార.



ఒకప్పుడు ఎన్నో గ్లామరస్ పాత్రల్లో  నటించి దశాబ్దకాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ హవా నడిపించింది నయనతార. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అందాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించటమే కాదు.. చాలా హీరోల సరసన భార్య పాత్రలో నటించింది.. కొన్ని సినిమాల్లో ఏకంగా తల్లి పాత్రలలో కూడా నటించింది నయనతార.



నయనతార ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు న్యాయం చేయగలరు అని ప్రేక్షకుల నమ్మకం. తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తుంది నయనతార. ఇప్పుడు వరకు హీరోయిన్ భార్య పాత్రలో నయనతార ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్రతి సినిమాలో సీనియర్ హీరోల భార్య పాత్రలో నటిస్తున్న నయనతార ఒకప్పుడు యువ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కూడా హీరోలకు భార్య పాత్రలు చేయడానికి అసలు వెనకడుగు వేయలేదు. ఇక అప్పుడు ఇప్పుడు నయనతార తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల భార్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. భార్య పాత్రలో హావభావాలు పండించడంలో నయనతారను ఎవరు దాటలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: