ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే నటించినా కానీ హీరోలకు భార్య పాత్రలో మాత్రం ఏ సినిమాలో నటించలేదు. కానీ ఇటీవలే యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం సీత. ఈ ప్రేమను నమ్మకుండా ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ కెరీర్లోనే సీత సినిమాలో నటించిన నెగటివ్ పాత్ర మొదటిది అని చెప్పాలి.
ఇప్పటివరకు ఎప్పుడూ కూడా నెగటివ్ పాత్రలో నటించలేదు కాజల్ అగర్వాల్. ముఖ్యంగా ఈ సినిమాలో డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నటిస్తోంది. అయితే తన ఆస్తి తనకు రావాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఈ సినిమాలో . ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అతన్ని వదిలేసి తన డబ్బు తనకి రావడంతో మళ్లీ నెగిటివ్ పాత్రలో కి వచ్చేస్తుంది కాజల్ అగర్వాల్. ఇలా ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది అనే చెప్పాలి. మొదటిసారి నెగటివ్ పాత్ర చేసినప్పటికీ కాజల్ అగర్వాల్ మాత్రం తన నటనతో ఆకట్టుకుంది.
Powered by Froala Editor