తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు హీరోలకు భార్య పాత్రలో నటించారు. అయితే కొంతమంది హీరోయిన్లు భార్య పాత్రలో నటించి కొద్దిసేపు కనిపించినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆ పాత్రలో హీరోయిన్ నటనకు ఎక్కువగా ఆకర్షితులు అయిపోతుంటారు. ఇలా భార్య పాత్రలో కొద్ది సమయం మాత్రమే కనిపించి అలా మాయమైన హీరోయిన్ రష్మిక మందన. విజయ్ దేవరకొండ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం గీతగోవిందం, ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో గడుసు పిల్ల గా నటిస్తోంది రష్మిక మందన. అయితే ఈ సినిమాలో రష్మిక విజయ్ దేవరకొండకు భార్యగా ఎప్పుడు నటించింది అని అంటారా... విజయ్ దేవరకొండ రష్మిక ను చూసి ప్రేమలో పడిన తర్వాత... ఒకవేళ రష్మిక తన భార్య అయితే తన ఇంట్లో రష్మిక తో ఎలా ఉంటాను అని ఊహించుకుంటాడు.



 ఆ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ భార్య పాత్రలో నటిస్తోంది. అయితే ఇలా భార్య పాత్రకు రష్మిక మందన ఒక పాట వరకు మాత్రమే పరిమితమవుతుంది. ఇక ఆ పాట తర్వాత మళ్లీ స్టోరీలోకి వచ్చేస్తారు ప్రేక్షకులు, ఇలా రష్మిక మందన మొదటిసారి విజయ్ దేవరకొండ కు భార్యగా  కొద్ది సమయంపాటు నటించింది అని చెప్పాలి. అయితే రష్మిక మందన్న నటించింది కొద్దిసేపే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి.



 భార్య పాత్రలో ఒదిగిపోయి నటించిన రష్మిక మందన్న తన నటనతో మెస్మరైజ్ చేసింది. అయితే భార్య పాత్రలో రష్మిక కొద్దిసేపు కనిపించడంతో ఇంకాస్త కనిపిస్తే బాగుండు అని తెలుగు ప్రేక్షకులు భావించారు. విజయ్ దేవరకొండ భర్తగా రష్మిక మందన భార్యగా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలూ వీరి హావభావాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి  అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు రష్మిక భార్య పాత్రలో నటించలేదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: