బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి( ప్రభాస్) ని పట్టాభిషిక్తుడుగా ప్రకటించే రాజమాత శివగామి పాత్ర లో నటించిన రమ్యకృష్ణ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలను  దక్కించుకుంది. బాహుబలి సినిమా ప్రారంభంలోనే రమ్యకృష్ణ కనిపిస్తుంది. అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి ని శత్రువుల నుండి కాపాడడానికి తాను బాణాల దాడికి గురై చివరికి నీళ్లల్లో నిల్చొని బిడ్డని పైకి పట్టుకొని అలాగే మరణిస్తుంది. 

 


మహేంద్ర బాహుబలి పెరిగి పెద్దవాడు అయ్యి తమన్నా ని కలుసుకుంటాడు. అమరేంద్ర బాహుబలి భార్య అయిన దేవసేనని భల్లాల దేవుడు సంకెళ్ళతో బంధించి ఆమెను బానిసను చేయగా ఆమెను విడిపించడానికి తమన్నా కొంతమంది నాయకులతో కలసి ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం తెలిసిన మహేంద్ర బాహుబలి తాను కూడా ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకుంటామని చెప్పి భల్లాల దేవుడి పరిపాలిస్తున్న మాహిష్మతి రాజ్యంలో అడుగుపెడతాడు. అప్పుడే అతనిని కట్టప్ప చూసి బాహుబలి కుమారుడు అని గ్రహించి జరిగిన కథ అంతా చెబుతాడు. 

 


ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో రమ్యకృష్ణ సన్నివేశాలు చాలా ఉంటాయి. తమ సొంత కుమారుడు భల్లాల దేవుడి కి, అమరేంద్ర బాహుబలి కి యుద్ధవిద్యలు నేర్పిస్తుంది శివగామి. వీళ్లిద్దరు లో ఎవరైతే ఎక్కువగా యుద్ధ విద్యలు నేర్చుకుంటారో వారికే మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఇస్తానని ఆమె చెబుతోంది. ఈ సమయంలోనే కాలకేయ మాహిష్మతి రాజ్యాన్ని ఆక్రమించడానికి దండెత్తుతాడు. అప్పుడే అమరేంద్ర బాహుబలి తనకి అసలైన రాజు కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకున్నాడు. దీంతో శివగామి అతడిని మాహిష్మతి రాజ్యానికి రాజుగా ప్రకటిస్తుంది. 


ఈ సన్నివేశాలలో రాజమాత పాత్రలో నటించిన రమ్యకృష్ణ చాలా సహజంగా నటించిందని చెప్పుకోవచ్చు. ఆమె ఒరిజినల్ వాయిస్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాహుబలి పార్ట్ 2 లో కూడా రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అనుష్క శెట్టి రమ్యకృష్ణ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమాలో నటించిన తమన్నా అనుష్క శెట్టి ల కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించింది రమ్యకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: