టాలీవుడ్ లో ఎప్పుడు ఏ హీరో టాప్ ప్లేస్ లో ఉంటాడో అన్నది ఎవరు చెప్పలేరు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ సమయానికి ఆ హీరోనే మొదటి స్థానంలో ఉంటాడు. ఒక్క సినిమా చాలు ఆ హీరోను అగ్రస్థానంలో నిలబెట్టడానికి. అయితే ఇప్పుడు చెప్పుకోదక్క విషయం ఏంటంటే మన టాలీవుడ్లో ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరని జరిపిన ప్రవేట్ సర్వేలో ముందు ఉన్న హీరో ఎవరో తెలుసా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

 


మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురము చిత్రంలో బన్నీ నటించిన విషయం తెలిసిందే. అలాగే  ఈ సినిమా కూడా బన్నీకి బంపర్ హిట్ ఇచ్చిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో బన్నీ రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే తాజాగా జరిగిన ఒక  ప్రైవేట్ సర్వేలో అల్లు అర్జున్‌కి మొదటి ప్లేస్ దక్కింది. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ తర్వాత  స్థానాలలో వరసగా మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నారు. తరువాత స్థానాలలో రంగస్థలం వంటి భారీ హిట్ కొట్టిన చరణ్, నానీ, విజయ్ దేవరకొండ ఉండడం కొద్దిగా గమనించాలిసిన విషయం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే మూవీలో నటిస్తున్నాడు.. ఈ సినిమా హిట్ అయితే బన్నీ ఖాతాలో మరొక హిట్ పడినట్లే..

 


ఇక తమిళ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మాస్టర్ సినిమాతో పలకరించనున్న విజయ్ తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆయన తర్వాత వరసగా  అజిత్‌, సూర్య, రజనీకాంత్‌, విజయ్ సేతుపతి, ధనుష్, కమల్ హాసన్, శివకార్తికేయన్‌, విక్రమ్, జయం రవి ఉన్నారు. తమిళంలో మంచి క్రెజ్ ఉన్న సీనియర్ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో అలరిస్తున్నప్పటికీ ఆయన స్థానం నాలుగుకి వెళ్ళడం విశేషం. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే ఏంటో అనుకున్నాం కదా.. అలాగే ఒక్క సినిమా కూడా ఆ హీరో తలరాతనే మార్చేస్తుందన్నది అంతే నిజం..

మరింత సమాచారం తెలుసుకోండి: