క్రియేటివిటీ ఉన్న దర్శకులు సినిమా తీస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్, డైలాగ్స్.. ఇలా ప్రతి అంశంలో వారు తీసుకనే కేర్ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది. తెలుగులో క్రియేటివిటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవ్ కట్టా తెరకెక్కించిన మాస్ కంటెంట్ మూవీ ‘ఆటోనగర్ సూర్య’. నాగచైతన్యసమంత హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ఆటోనగర్ లో మెకానిక్ గా నాగచైతన్య పాత్ర ఉంటుంది. ఈ సినిమా విడుదలై నేటికి 6ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఆటోనగర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2014 జూన్ 27న విడుదలైంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా తీశాడు దేవ్ కట్టా. దేవకట్టాకు మాటలు రాయడంలో మంచి పేరు ఉంది. అది ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమాలో స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుంది. అయితే.. బడ్జెట్ లో లోటుపాట్లు వల్ల సినిమా రిలీజ్ లో ఆలస్యమైంది. ఈ ఎఫెక్ట్ సినిమాపై పడింది. అనుకున్న కథను దర్శకుడు సినిమాను ప్రెజంట్ చేయలేకపోయాడు. కథలో బలం.. తెరకెక్కించిన విధానంలో నవ్యత, హిట్టయ్యే అంశాలు ఉన్నా కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా మిస్ ఫైర్ అయింది.

IHG

 

లవ్ సబ్జెక్ట్ లో వెన్నెల, రాజకీయ కధాంశంతో ప్రస్థానం తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు దేవ్ కట్టా. నాగచైతన్య మాస్ ఇమేజ్ కోసం చేసిన అటెంప్ట్స్ బెజవాడ, దడ కోవలోకే ఆటోనగర్ సూర్య చేరిపోయింది. నాగచైతన్యసమంత కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. వారిద్దరి పెయిర్ ఎప్పటిలానే ఆకట్టుకుంది. అనూప్ రుబెన్స్ సంగీతం ఆకట్టుకున్నా ప్లస్ కాలేదు. సినిమాలో హీరోయిన్ గా మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నా సమంతను ఫైనల్ చేశారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను అచ్చిరెడ్డి నిర్మించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: