బుల్లితెర మెగా కామెడీ షో జబర్దస్త్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవిధంగా చెప్పాలంటే జబర్దస్త్ కు తెలుగు ప్రేక్షకులు అలవాటయ్యారని చెప్పొచ్చు. అందుకే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన జబర్దస్త్ షో అలా మొదలైందో లేదో తెగ చూసేస్తున్నారు. కేవలం టివిలో చూడటమే కాదు యూట్యూబ్ లో కూడా వ్యూస్ తో దుమ్ముదులిపేస్తుంది. 3 నెలలు గ్యాప్ తర్వాత జబర్దస్త్ షో మొదలైంది. 

 

అయితే ఈ షో ప్రోమోనే అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ రాబడుతుంది. ఇక గురు, శుక్రవారల ఎపిసోడ్స్ కూడా టివిలో చూడటమే కాకుండా రిపీట్ మోడ్ లో యూట్యూబ్ లో చూసేస్తున్నారు. అందుకే ఇలా యూట్యూబ్ లో పెట్టారో లేదో అలా మిలియన్ వ్యూస్ రాబడుతుంది. ఆఫ్టర్ 3 మంథ్స్ జబర్దస్త్ జబర్దస్తీగా మొదలైంది. అంతేకాదు బుల్ల్తెర కామెడీ షోలో తనకు తిరుగులేదని మరోసారి ఈ షో ప్రూవ్ చేసుకుంది. మిగతా ఛానెల్స్ ఇలాంటి క్రేజీ షోస్ కోసం ప్రయత్నించినా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 

ఇక జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు, కొంతమంది జబర్దస్త్ టీం మేట్స్ కూడా జీ తెలుగులో అదిరింది షో చేస్తున్నారు. ఈ షో కూడా ఇప్పుడిప్పుడే జబర్దస్త్ కు పోటీ ఇచ్చేలా కనబడగా అంతలోనే లాక్ డౌన్ వచ్చి షో ఆగిపోయింది. మరి జబర్దస్త్ రీ స్టార్ట్ చేశారు.. కాని అదిరింది నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. ముందు స్టార్ట్ చేసిన జబర్దస్త్ మాత్రం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఆఫ్టర్ గ్యాప్ కొత్త టీం లతో సర్ ప్రైజ్ ఇచ్చి కామెడీతో ఆడియెన్స్ కు కడుపుబ్బా నవ్విస్తున్నారు కమెడియన్స్.                     
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: