ఒకప్పుడు ఇయర్ కు మూడు నాలుగు సినిమాలతో సందడి చేసే అల్లరి నరేష్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనకపడ్డాడు. తన సినిమాలతో జబర్దస్త్ కామెడీ పంచే అల్లరోడి సినిమాలు అప్పట్లో నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టేవి. అయితే స్పూఫ్ సినిమాలు పెరగడం.. ప్రతి హీరో కామెడీ ట్రై చేయడంతో అల్లరి నరేష్ సినిమాలకు డిమాండ్ తగ్గింది. హిట్టు కోసం తపిస్తున్న అల్లరి నరేష్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా బంగారు బుల్లోడు కాగా.. మరోటి ప్రయోగాత్మక సినిమా నాంది. 

 

ఇక లేటెస్ట్ గా నాంది ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో నగ్నంగా అల్లరి నరేష్ ఓ టేబుల్ కింద కూర్చుని కనిపించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. హరీష్ శంకర్, సతీష్ వేగేశ్నల దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నాంది సినిమా ప్రీ లుక్ పోస్టరే సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా కామెడీ హీరో ఈసారి సీరియస్ సబ్జెక్ట్ ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు.

 

కెరియర్ లో 56 సినిమాలు చేసిన అల్లరి నరేష్ 57వ సినిమాగా నాంది చేస్తున్నాడు. ఈ సినిమా ఓ క్రైం థ్రిల్లర్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. ప్రీ లుక్ తోనే అల్లరోడు ఈసారి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చాడు. మరి అల్లరి నరేష్ ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడా.. నాందితో హిట్టుకి నాంది పలకాలన్న అల్లరోడు కోరిక తీరుతుందా లేదా అన్నది చూడాలి.                         

మరింత సమాచారం తెలుసుకోండి: