నిధి అగర్వాల్ ఇప్పుడు ఒక సినిమాని తన భుజాల మీద మోయబోతుందట. హీరోతో పోల్చుకుంటే ఈ సినిమాకి హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగ్ర్వాల్ మీదే సినిమా సక్సస్ ఆధారపడి ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో గాని ఈ విషయంలో బయట జనాలు కూడా నిజమనే ఒప్పుకుంటున్నారు.

 

సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనళ్లుడు.. ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా వెండి తెరకి పరిచయం అవుతున్నాడు. వాస్తవంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఈ హీరో పరిచయం కావాల్సింది. సినిమా ఘనంగా ప్రారంభం కూడా అయింది. కాని ఒక్క షెడ్యూల్ కూడా జరగ కుండా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 'భలే మంచి రోజు' 'శమంతకమణి' 'దేవదాస్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. 

 

జగపతి బాబు సీనియర్ నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా ఒక సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ యమలీల సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సాంగ్ కావడం విశేషం. అయితే ఈ సాంగ్ చూసిన వాళ్ళు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ని చేస్తున్నారు. 

 

అశోక్ ఇంకా చాలా కష్టపడాలి అంటూ సలహాలిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నదాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా కి బజ్ వస్తే అది నిధీ అగర్వాల్ వల్లే అని అంటున్నారు. ఎందుకంటే నిధీ ఇప్పటికే టాలీవుడ్ లో బ్యూటి ఫుల్ హీరోయిన్..ఇస్మార్ట్ బ్యూటి అన్న పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ పేరు మీద కాస్త బజ్ వస్తుంది తప్ప హీరో వల్ల కాదు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయితే గాని తెలీదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: