తెలుగు సినిమాల్లో విజయశాంతి చేసిన పాత్రలు ఎంతో ప్రత్యేకమైనవి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. హీరోయిన్ గా, హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ లో విజయశాంతి చూపిన నటన ఆమెను సూపర్ స్టార్ ను చేశాయి. ఇవి కాకుండా ఆమెకు సినిమాల్లో హీరోతో సమానంగా పాత్రలు దక్కేవి. అలా ఆమె పాత్రలను డిజైన్ చేశారు రచయితలు, దర్శకులు. ఆమె పూర్తి మాస్ క్యారెక్టర్లు చేసిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగిన సినిమా బాలకృష్ణతో చేసిన రౌడీ ఇన్ స్పెక్టర్. ఆ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ మాస్ తరహాలో ఉంటుంది.

IHG

 

సినిమాలో విజయశాంతి ఆటో డ్రైవర్ గా నటించింది. ఆటోరాణి అనే పాత్రలో ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. బాలకృష్ణతో పాటు సమానంగా ఆమె క్యారెక్టర్ ఉండటం విశేషం. సినిమాలో ఆమె ఎంట్రన్సే ఓ ఫైట్ తో ఉంటుంది. సినిమా అంతా ఆమె ఆటో డ్రైవర్ మేకోవర్ లోనే ఉంటుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం అటువంటిది. సినిమాలో ఆమెకు ఫైట్స్, ఛేజింగ్ సీన్లు కూడా ఉంటాయి. అల్లరి మూకలతో పోరాటాలు, ఛాలెంజింగ్ డైలాగ్స్ తో విజయశాంతి తన స్థాయి నటన ప్రదర్శించింది. సినిమా విజయంలో విజయశాంతి పాత్ర కీలకంగా మారిందంటే ఆమె ఎంత మాస్ క్యారెక్టర్ చేసిందో తెలుస్తుంది.

IHG

 

సినిమాలో వచ్చే పాటలు కూడా పూర్తి మాస్ బీట్స్ లో ఉంటాయి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయలక్ష్మ్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కింది. బాలకృష్ణ – బి.గోపాల్ – విజయశాంతి కాంబినేషన్లోనే అంతకుముందు వచ్చిన లారీ డ్రైవర్ కూడా హిట్ సినిమానే. ఈ సినిమాలో కూడా విజయశాంతి మాస్ క్యారెక్టర్ చేసింది. ఆ హిట్ సెంటిమెంట్ రౌడీ ఇన్ స్పెక్టర్ కు కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: