రాజమౌళి దర్శకత్వంలో బాలీవుడ్ అందాలభామ ఆలియాభట్ రామ్ చరణ్ పక్కన నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు స్టూడెంట్ గా అవతారమెత్తి నేర్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇంత అర్జెంటుగా తెలుగు నేర్చుకోవడానికి గల కారణం చూస్తే... 'RRR' కోసం అని సమాచారం. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే తెలుగు నేర్చుకోవాలి అని భావించిన ఆలియా భట్ ముంబైలో టుటోర్ పెట్టుకుని కొన్ని రోజులు నేర్చుకోవడం జరిగింది.

 

మధ్యలో మహమ్మారి కరోనా రావటంతో తెలుగు క్లాసులకు బ్రేక్ పడింది. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సినిమా షూటింగులకు ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో రాజమౌళి మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో ఆలియా భట్ మళ్లీ తెలుగు పాఠాలు మొదలు పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు అందుతున్నాయి. ఈ క్రమంలో వెంటనే మళ్లీ తెలుగు టీచర్ ని పిలిపించుకొని… షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలుగు మొత్తం నేర్చుకోవాలని పట్టుదలతో ఉందట.

 

మొత్తం మీద రాజమౌళి సినిమా కోసం ఆలియా భట్ భాష కూడా నేర్చుకోవడం విశేషమని…. సినిమా మీద ఎంతో నమ్మకం ఆలియా భట్ కి ఉండి ఉంటుందేమో అందుకే తెగ కష్టపడుతుంది అని సినిమా ఇండస్ట్రీలో మామ ఏం చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రామ రాజు పాత్రలో నటిస్తుండగా ఆలియా భట్ సీత పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య అదిరిపోయే సన్నివేశాలు భావోద్వేగపరమైన సన్నివేశాలు చాలా కీలకమని సినిమాకి హైలెట్ గా ఉంటాయని ఇండస్ట్రీ లో టాక్. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ తో పగడ్బందీ గా చిత్రీకరించాలని రాజమౌళి డిసైడ్ అయ్యారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: