సినిమాలలో మన టాప్ హీరోలు ఒకేసారి 20 మంది రౌడీలను ఊచకోసినట్లు నటిస్తారు. అలా వాళ్ళు నటిస్తున్నప్పుడు ధియేటర్లు చప్పట్లు ఈలలతో మారుమ్రోగిపోయేవి. అయితే కరోనా వచ్చిన తరువాత ధియేటర్లు మూత పడటంతో అలాంటి దృశ్యాలు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాయో హీరోలకు కూడ తెలియని పరిస్థితి.


పేజీలపేజీల కొద్ది ఉండే డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పే హీరోలు ప్రస్తుతం న్యూస్ పేపర్లను చూసి హడాలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో తమ గురించి పెద్దపెద్ద పేపర్ల ఇంటర్వ్యూలు చేసినప్పుడు వారి గురించి స్పెషల్ ఫీచర్స్ వ్రాసినప్పుడు ఎంతో సంతోషంగా ఆ పత్రికలలోని వార్తలను చూసే ఎంజాయ్ చేసే హీరోలు ప్రస్తుతం చాలామంది తమ ఇళ్ళకు పేపర్లు కూడ వేయించుకోకుండా వాటిని దూరం పెట్టినట్లు టాక్.


అనుక్షణం మీడియాలో కవరేజ్ గురించి తపనపడే హీరోలు ఇలా ప్రవర్తించడం వెనుక కరోనా భయాలు అని అంటున్నారు. న్యూస్ పేపర్లు ద్వారా కరోనా వైరస్ తమ ఇంటిలోకి వస్తాయేమో అన్నభయంతో ఇలా న్యూస్ పేపర్లను దూరం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కరోనా వైరస్ భయాలతో చాలామంది న్యూస్ పేపర్లు చదివేవారు కూడ పేపర్లు ముట్టుకోవడానికి భయపడిపోతున్నారు. కరోనా వైరస్ ఒక వస్తువు పై కనీసం ఆరు గంటలకు పైగా జీవించి ఉంటుంది అన్నభయాలు ఏర్పడంతో ఇప్పటికే న్యూస్ పేపర్లను ఇష్టపడి చదివే చాలామంది న్యూస్ పేపర్లను కొనడం మానేశారు.


ఈ విషయాలు ప్రస్తుతం వాస్తవాలే అయినా భయంకరమైన విలన్స్ ను ఊచకోత కోయడంలో కోట్లు ఖర్చు చేసే యాక్షన్ సీన్స్ లో నటించే ఇండస్ట్రీ టాప్ యాక్షన్ హీరోలు కూడ ఒక న్యూస్ పేపర్ ను చూసి భయపడి పోవడం వింతగా ఉంది అంటూ ఒక ప్రముఖ న్యూస్ పేపరు ప్రచురణ కర్త కరోనా సమస్యలు వల్ల ఏర్పడ్డ ప్రజల భయాలు గురించి మాట్లాడుతూ టాప్ హీరోల ప్రస్తావన తీసుకు వచ్చినట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: