టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇటీవలే పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కరోనా కారణంగా సినిమా షూటింగులకి గ్యాప్ రావడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్రీకరణకి అనుమతులు ఇవ్వడంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కార్తికేయ షూటింగులో పాల్గొననున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన నిఖిల్, ఆ తర్వాత యువత సినిమాతో సోలో హీరోగా ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు.

 

అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూసాడు. కానీ ఆ తర్వాత వచ్చ్చిన స్వామిరారా చిత్రంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. స్వామి రారా తర్వాత విభిన్నమైన కథాంశాలని ఎంచుకుంటూ ప్రేక్షకులకి వినూత్నమైన సినిమాలని అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సూర్య వర్సెస్ సూర్య వంటి చిత్రాలు చేసాడు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలనే ఎన్నుకుని విజయాన్ని దక్కించుకుంటున్నాడు.

 

ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో 18 పేజెస్ అనే ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నిఖిల్ పాత్ర గురించి తాజాగా ఓ అప్డేట్ బయటకి వచ్చింది. హీరో పాత్ర మెమోరీ మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. 

 

అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందట. హీరో పాత్ర ఆ సమస్యతోనే విలన్స్ ను ఎలా ఎదురుకున్నాడు అనే కోణంలో సినిమా సాగుతుందట. మెమరీ లాస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా.. గజిని. మరి గజిని సినిమాలా అందరినీ ఆకట్టుకుంటుందా లేదా చూడాలి. 18 పేజెస్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: