3 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు నాల్గవ సీజన్ కు సిద్ధం కాబోతుంది. బిగ్ బాస్ 4కి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ 3 సీజన్ లో క్రేజీ కంటెస్టంట్ పునర్నవి భూపాలం షోలో తన సత్తా చాటింది. రాహుల్ తో ఆమె చేసినా స్నేహం ఇలా షోలో తన మార్క్ కనిపిచేలా చేసింది. ఇక బిగ్ బాస్ లో లోపల చాలా జరుగుతుందని కాకపోతే 24 గంటలు జరిగే దానిలో వాళ్లకు కావాల్సింది మాత్రమే ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తారంటుంది పునర్నవి.

 

అక్కడ జరిగేదానికి ఇక్కడ చూపించే దానికి చాలా తేడా ఉంటుందని.. లోపల ఏం జరిగినా సరే అవసరమైందే చూపిస్తారు తప్ప మిగతాది చూపించరని చెబుతుంది పునర్నవి. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారక్టర్ చేసిన పునర్నవి ఆ తర్వాత సిస్టర్ రోల్స్ చేస్తూ పాపులరిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ 3 తర్వాత అమ్మడికి మచి క్రేజ్ వచ్చింది. ఈ షోలో రాహుల్ తో ఆమె క్లోజ్ నెస్ చూసి ఇద్దరు ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి.

 

రాహుల్ విన్నర్ అయ్యాక ఇద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అయితే రాహుల్ తో తనకు ఎలాంటి పర్సనల్ రిలేషన్ లేదని.. కేవలం అతను మంచి స్నేహితుడు మాత్రమే అంటుంది పునర్నవి. కేవలం షో వరకే వీళ్లి అలా నటించారన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఏది ఏమైనా సరే ప్రతి సీజన్ లో ఒక జోడీ సెట్ అయినట్టు సీజన్ 3లో రాహుల్, పునర్నవిలు ప్రేక్షకులను అలరించారు. మరి రాబోయే సీజన్ 4లో జోడీగా ఎవరు వస్తారు.. వాళ్లు చేసే హంగమా ఎలా ఉంటుందో చూడాలి.          

మరింత సమాచారం తెలుసుకోండి: