తమిళ హీరో విశాల్ తెలుగు వారందరికీ పరిచయమే. విశాల్ తెలుగువాడే అయినా తమిళంలో హీరోగా సెటిల్ అయ్యాడు. తమిళంలో పాటు తెలుగులోనూ తన సినిమాలని విడుదల చేస్తూ ఇక్కడ కూడా ఎంతో కొంత మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా అనువాద చిత్రాలకి తెలుగులో అంతగా రెస్పాన్స్ రావడం లేదు. రజనీ కాంత్ నుండి మొదలుకుని సూర్య, విశాల్, విజయ్ చిత్రాలకి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. 

 

మరి చక్ర సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయితే సైబర్ హ్యాకింగ్ నేపథ్యంలో రూపొందినట్టున్న ఈ సినిమా విశాల్ అభిమన్యుడు సినిమాకి సీక్వెల్ లాగా అనిపిస్తుంది. చక్ర సినిమాలోనూ విశాల్ మిలిటరీ మేజర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మళయాలంలోనూ విడుదల చేయనున్నారట. ఈ మేరకు ట్రైలర్ ని నాలుగు భాషల్లో రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

IHG't Move My Feet”. <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REGINA CASSANDRA' target='_blank' title='regina cassandra -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>regina cassandra </a>Says She Was  Molested Near Ega Theatre !! | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHENNAI' target='_blank' title='chennai-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chennai</a> Memes

ఆనందన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో లేడీ విలన్ ఉండనున్నది సమాచారం. లేడీ విలన్ గా పేరు మోసిన స్టార్ హీరోయిన్ చేయనుందని తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రెజీనా కెసాండ్రా అని అంటున్నారు. ట్రైలర్ లో రెజీనా కెసాండ్రా ఎక్కడా కనిపించదు. అసలు విలన్ ఎవరనేది చూపించనే లేదు. అదే అభిమన్యుడు సినిమాలో అయితే అర్జున్ విలన్ అని ముందే చూపించారు. 

 

కానీ ఇక్కడ రెజీనాని విలన్ గా చూపించబోతున్నారు కాబట్టి ఒక్కసారిగా షాకింగ్ గా అనిపించేలా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ట్రైలర్ లో ఆమెని చూపించలేదని అంటున్నారు. అదీగాక చక్ర ట్రైలర్ రిలీజ్ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకోవడం ఈ అనుమానాలకి తావిస్తుంది. అయితే రెజీనాకి విలన్ గా చేయడం కొత్తేమీ కాదు. ఎవరు, సెవెన్ చిత్రాల్లో ఆమె విలనిజం ఎలా పండించగలదో ఇదివరకే చూసాం. మరి చక్ర సినిమాలో విలన్ గా ఎలాంటి పర్ఫామెన్స్ ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: