లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దక్షణ భారతదేశంలోనే గ్లామర్‌కే గ్రామర్ నేర్పిన ది లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ మరెవ్వరో కదండీ విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ కథ రాదా? అనే ప్రశ్నలకు తన చిత్రాలతో సమాధానం ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌కి కొత్త రూపు తీసుకువచ్చిన ఘనత ఈ లేడీ సూపర్ స్టార్‌కే దక్కుతుంది.

 

 

విజయ శాంతి – వినోద్ కుమార్ జంటగా నటించిన కర్తవ్యం సినిమా 1990లో విడుదలైంది. ఈ సినిమాకి ఎ మోహన గాంధీ దర్శకత్వం వహించగా.. సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం రత్నం నిర్మించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి.. అంగబలం, అర్థబలం కలిగిన రౌడీలను ఎలా ఎదుర్కొన్నదీ ఈ చిత్ర కథాంశం.

 

 

లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ 'కర్తవ్యం'. 90వ దశకంలో మహిళా ప్రాధాన్యతా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చిత్రమిది. మోహన్‌గాంధీ దర్శకత్వంలో విజయశాంతి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మూడు దశాబ్దాల తర్వాత 'కర్తవ్యం' సినిమాకు మరో అరుదైన గుర్తింపు దక్కింది.

 

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా(ఎన్.ఎఫ్‌.ఎ.ఐ) ఈ సినిమా తెలుగు, హిందీ పోస్టర్స్‌ను సామజిక మీడియాలో పోస్ట్ చేశారు. 'కర్తవ్యం' సినిమా 1990లో విడుదలైతే.. 1994లో దీన్ని హిందీలో 'తేజస్విని' పేరుతో రీమేక్ చేశారు. హిందీలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. వైజయంతి ఐపీఎస్ పేరుతో తమిళంలోకి అనువదిస్తే అక్కడా అఖండ విజయం సాధించింది.

 

 

ముప్పై ఏళ్లలో ఎన్నో మహిళా ప్రాధాన్యతా చిత్రాలు వచ్చినప్పటికీ 'కర్తవ్యం' సినిమా పోస్టర్స్‌ను ఎన్.ఎఫ్‌.ఎ.ఐ పోస్ట్ చేయడం తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గుర్తింపు చెప్పవచ్చు.ఈ చిత్రానికి గాను విజయశాంతికి ‘జాతీయ ఉత్తమనటి’ అవార్డుతో పాటు ‘ఫిలింఫేర్, నంది’ అవార్డులు లభించాయి. మూడు దశాబ్దాలు పూర్తయిన కూడా ఈ చిత్రానికి ఇప్పుడు అరుదైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: