టాలీవుడ్ లో చాలా తక్కువ కాలానికే మంచి ఇమేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ కి వెళ్ళింది ముమైత్ ఖాన్. ఇక లేడీ ఓరియే౦టెడ్ సినిమాల విషయంలో విజయశాంతి రేంజ్ కి వెళ్తుంది అని చాలా మంది కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆమె నటించిన మైసమ్మ ఐపిఎస్ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అది అలా ఉంటే ఆమెకు వచ్చిన ఇమేజ్ లో ప్రధానంగా మాస్ ఇమేజ్ కూడా చెప్పవచ్చు. ఏ హీరోయిన్ కి అంత ఫాస్ట్ గా రాలేదు అనే చెప్పాలి. ఐటెం సాంగ్స్ ఆమె చేస్తుంది అంటే యూత్ కి ఒక రేంజ్ లో పిచ్చి ఎక్కే విధంగా ఉంటుంది. 

 

ఆ విధంగా ఆమె ఐటెం సాంగ్స్ విషయంలో... ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె మినహా ఎవరూ చేసినా సరే  ఆ రేంజ్ లో ఉండదు అనే కామెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నా సరే ఆమె ఐటెం సాంగ్స్ చేస్తుంది అంటే  యూత్ లో మంచి ఇమేజ్ ఉంటుంది అనే చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా సరే ఆమెను పిలిచి అవకాశాలు ఇచ్చే వారు కనపడటం లేదు అని టాలీవుడ్ లో టాక్. 

 

దీనితో ఆమె సినిమాల విషయంలో కాస్త అసహనంగా ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె ఇప్పుడు రెండేళ్ళు గా సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు అనే బాధ ఎక్కువగా ఉంది అని ఇప్పుడు వ్యాపారం చేసుకుంటుంది అని అంటున్నారు. పూరి సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది అనే ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: