వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న గోపీచంద్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. లౌక్యం తర్వాత ఆయన హీరోగా తెరకెక్కిన సినిమాలేవీ విజయాన్ని అందుకోలేవు. అయితే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సీటీమార్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై గోపీచంద్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. దానికి కారణం సంపత్ నంది.

 

సంపత్ నంది- గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన గౌతమ్ నంద హిట్ కావాల్సిన చిత్రమే. కానీ ఏవేవో కారణాల వల్ల ఆ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. గౌతమ్ నంద ఫ్లాప్ అయినప్పటికీ టెలివిజన్ పై బాగా ఆడుతుంది. అయితే వీరిద్దరూ కలిసి చేస్తున్న సీటీమార్ చిత్రం గోపీచంద్ కెరీర్లో గుర్తుండిపోయేలా అవుతుందని.. ఈ సినిమాతో గోపీచంద్ కమ్ బ్యాక్ అవుతాడని అంటున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

 

అయితే గోపీచంద్, ఆంధ్రాప్రాంత అమ్మాయిల కబడ్డీ జట్టుకి కోచ్ గా కనిపిస్తుంటే, ఇటు తమన్నా, తెలంగాణ అమ్మాయిల కబడ్డీ జట్టుకి కోచ్ గా కనిపించనుంది. కోచ్ గా తమన్నా పేరు జ్వాల రెడ్డి అని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గోపీచంద్ కి అసిస్టెంట్ కోచ్ గా ఒక ప్రముఖ కమెడియన్ నటించనున్నాడని అంటున్నారు. ఆ కమెడియన్ ఎవరో కాదు.. కమెడియన్ గా టాప్ లో ఉన్నప్పుడు హీరోగా అవకాశాలు రావడంతో అటువైపు వెళ్ళి, మళ్ళీ కమెడియన్ గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సునీల్..

IHG

సునీల్ గోపీచంద్ కి అసిస్టెంట్ గా నవ్వులు పండిస్తాడని చెబుతున్నారు. మరి ఈ విషయమై చిత్రబృందం ఇంకా క్లారిటి ఇవ్వలేదు. కాకపోతే సునీల్ కన్ఫర్మ్ అయినట్టే అని వార్తలు వస్తున్నాయి. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాతో వస్తున్న గోపీచంద్, ఈ సారైన హిట్ కొడతాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: