మన తెలుగులో త్రిష చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమెకు వచ్చిన ఇమేజ్ మాత్రం చాలా ఎక్కువ. ఆమె సినిమాలను యువత బాగా ఆదరించారు. ఆమె సినిమాలు క్లాస్ కంటే కూడా మాస్ కే బాగా నచ్చాయి అని చెప్పాలి. ఆమె చేసిన సినిమాల్లో ఆమె పాత్రను దర్శకులు తీర్చి దిద్దిన విధానం ముందు మాస్ కి బాగా నచ్చింది. బుజ్జిగాడు అనే సినిమాలో ఆమె పాత్ర మాస్ కి బాగా నచ్చింది. చిట్టి అనే పాత్రలో ఆమె అలరించారు. ఇక నాగార్జున హీరోగా వచ్చిన కింగ్ సినిమాలో కూడా ఆమె మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

అదే విధంగా చిరంజీవి హీరో గా వచ్చిన స్టాలిన్ సినిమాలో కూడా ఆమె మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇలా చేసిన సినిమాలు అన్నీ కూడా మాస్ ని క్లాస్ ని ఎక్కువగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె తమిళం లో చేస్తున్న కొన్ని సినిమాలు కూడా మాస్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి అని చెప్పవచ్చు. ఈ విధంగా ఆమె తన మార్క్ ని వేసింది. తెలుగులో చేసిన కొన్ని కొన్ని సినిమాలతో స్టార్ హీరోయిన్ గుర్తింపు వచ్చింది గాని సొంత భాష తమిళం పై ఆమెకు ఉన్న ప్రేమ ఆమెను అటు నడిపించింది అని చెప్పవచ్చు. 

 

ఇక ఇప్పుడు ఆమె తెలుగులో పెద్దగా సినిమాలను చేయడం లేదు. రెండు మూడు సినిమాల్లో ఆమె నటిస్తుంది అనే వార్తలు వచ్చినా సరే ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు అని టాలీవుడ్ లో టాక్. ఇప్పుడు ఆమె ఒక సినిమాను మాత్రం తెలుగులో చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి చేస్తుందా లేదా అనేది. తమిళంలో ఆరు సినిమాలు లైన్ లో పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: