ముమైత్ ఖాన్ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించారు. ముమైత్ ఖాన్ సినిమాలతో పాటు, ఝలక్ దిఖ్లా జా 6, బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ వంటి రియాలిటీ షోలలో ఆమె పోటీ పడ్డారు. 2017 నాటికి ఆమె 40 తెలుగు సినిమాలు, 20 కి పైగా హిందీ సినిమాలు, 16 తమిళం, 5 కన్నడ చిత్రాల్లో పని చేశారు. సంజయ్ దత్ నటించిన మున్నా భాయ్ ఎంబిబిఎస్ లో ఆమె అతిధి పాత్ర పోషించారు.

 

 

ముంబై టు హైదరాబాద్ ఫిలిమ్ ఇండస్ట్రీ ముమైత్ ఖాన్ జర్నీ గురించి తెలిసిందే. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే!  అంటూ పోకిరి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.  టాలీవుడ్ లో ఐటెమ్ భామగా దశాబ్ధం పాటు ఓ ఊపు ఊపేసింది. ముమైత్ నే కథానాయికగా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు సూట్కేసులు పట్టుకుని తిరిగారంటే ఆ హిస్టరీని పదే పదే తలుచుకోకుండా ఉండలేం. ఆమె మైసమ్మ ఐపీఎస్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో మాస్ తో అందరిని ఆకట్టుకున్నారు.

 

 

ఆమె ఐటెం సాంగ్స్ విషయంలో ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే ఆమె మినహా ఎవరూ చేసినా సరే ఆ రేంజ్ లో ఉండదు అనే కామెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నా సరే ఆమె ఐటెం సాంగ్స్ చేస్తుంది అంటే యూత్ లో మంచి ఇమేజ్ ఉంటుంది అనే చెప్పవచ్చు.

 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా సరే ఆమెను పిలిచి అవకాశాలు ఇచ్చే వారు కనపడటం లేదు. ఆమె ఇప్పుడు రెండేళ్ళు గా సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు అనే బాధ ఎక్కువగా ఉంది అని ఇప్పుడు వ్యాపారం చేసుకుంటుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: