కరోనా తన విశ్వరూపం చూపిస్తోంది. అందులోనూ ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. కరోనా బారిన పడకుండా ఉండటానికి ఎవరికీ మినహాయింపులు లేవు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ సైతం కరోనా బారిన పడ్డారు.

 

 

అయితే ఈ కరోనా వాళ్లకు వచ్చింది.. వీళ్లకు వచ్చింది అంటూ సెలబ్రెటీలపై అనేక న్యూస్ ప్రచారం అవుతున్నాయి. అలాగే.. ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌కు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కరోనా ఎవరికైనా రావచ్చు కాబట్టి.. ఇది నిజమేమో అనుకుంటున్నారు.

 

 

అందుకే ఈ వార్తలపై ఓంకార్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఓంకార్ కు కరోనా వచ్చిందంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఓంకార్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందులో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

 

 

ప్రస్తుతం ఆయన ఇస్మార్ట్‌జోడీ కార్యక్రమం షూటింగ్‌ లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్‌ జోడీ షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. సో.. ఓంకార్ కు కరోనా అన్నది ఉత్త ఫేక్ న్యూస్ అన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: