టాలీవుడ్ లో అయినా మరో భాషలో అయినా సరే శ్రీదేవి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆమె ఇమేజ్ ఆమె నటన ఆమె చేసిన పాత్రలు ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఏ సినిమా చేసినా సరే మాస్ కి  క్లాస్ కి అందరికి కూడా ఆమె చాలా బాగా నచ్చుతుంది అని ఆమె సినిమాలు చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. ఆమెకు వచ్చిన ఇమేజ్ చూసి ఇతర హీరోయిన్ లు కూడా చాలా ఇబ్బంది పడే వారు. ఆమె చేసిన సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు ఆమె చూపించిన అందాలు అన్నీ కూడా మాస్ ని చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చేసిన కొన్ని కొన్ని పాత్రలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. బాలీవుడ్ లో అయితే ఆమెను చాలా మంది ఒక దేవత మాదిరి గా భావించారు అనే చెప్పాలి. టాలీవుడ్ లో కూడా అంతే... ఆమె  తో సినిమా చేయడానికి అగ్ర హీరోలు చాలా మంది ఎదురు చూస్తూ  ఉండే వారు. ఆమె తో సినిమా చేస్తే స్టార్ హీరో అనే ఇమేజ్ వస్తుంది అని భావిస్తారు. అందుకే ఆమె విషయంలో దర్శక నిర్మాతలు సైతం చాలా జాగ్రత్తగా ఉండే వారు. ఆమె పారితోషికం కూడా ఎక్కువగా తీసుకునే వారు కాదు అని చెప్తారు కొందరు. 

 

ఏది ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయారు అనే చెప్పాలి. ఆమె నటించిన కొన్ని కొన్ని సినిమాలు ఆమెను దేవత ను చేసాయి తెలుగు తమిళ భాషల్లో. అగ్ర హీరోలకు ఆమె ఇప్పటికి దేవతే. ఆ విధంగా పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: