స‌మంత.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తూ.. సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొడుతోంది. అయితే స‌మంత కెరీర్‌లో హిట్ సినిమాల్లో రంగస్థలం సినిమా కూడా ఒక‌టి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్‌ హీరోయిన్ సమంత జంట‌గా న‌టించిన ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్  నిర్మించిన ఈ చిత్రం కాసుల వ‌ర్షం కురిపించింది. 

IHG

గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఈ కథలో కుటుంబంలో ఉండే విభేదాలు, భావోద్వేగాలు సజీవంగా నిలుపడంలో దర్శకుడు సుకుమార్ ఫుల్ స‌క్సెస్ అయ్యాడు. అలాగే ఇన్నేళ్ల కెరీర్‌లో నటనపరంగా రాని పేరు  ‘రంగస్థలం’ సినిమాతో సంపాదించుకున్నాడు రామ్ చరణ్. మ‌రియు ఇంతకాలం ఓ వేలో కనిపించిన రామ్ చరణ్, చాలెంజింగ్ రోల్ లో కూడా మెప్పించగలడని ప్రూవ్ చేసుకున్నాడు. మ‌రోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ పాత్రలో కనిపించి స‌మంత ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంది.

IHG

పల్లెటూరి యువతి రామలక్ష్మిగా స‌మంత జీవించేసింది. స‌మంత‌కు, చరణ్ కు మధ్యన నడిచే ప్రతి సన్నివేశం ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా తడబడకుండా.. గోదావరి యాసలో మాట్లాడుతూ తెరపై ఓ మ్యాజిక్ క్రియేట్ చేసింది స‌మంత‌. ఓ సాదాసీదా కథకు 1980 నాటి వాతావరణాన్ని, పరిస్థితులను జోడించి అందమైన దృశ్యకావ్యంలా మ‌లిచిన ఈ చిత్రం.. ఒక్క ఓవర్సీస్‌ మార్కెట్‌లోనే మూడున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి 2018 టాలీవుడ్ బిగ్గెస్ట్  బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. కాగా, ఇప్పటికే ఈ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా రంగస్థలం తమిళం, మలయాళంలో డబ్ చేసిన సంగ‌తి తెలిసిందే.
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: