నానీ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒక క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా కథ ఏంటీ అందులో నానీ ఏ విధంగా కనపడతాడు అంటూ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కథలో ఉండే  కోణం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. బిన్నమైన కథలను ఎంపిక చేసుకునే విషయంలో నానీ ఎప్పుడు ముందు ఉంటాడు. ఇక ఇప్పుడు అతను ఒక విలక్షణ పాత్రలో కనపడటానికి సిద్దమయ్యాడు. స్టార్ నాని, సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం వీ. 

 

సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. కథ పైనే ఇప్పుడు అందరి చర్చ కూడా. అసలు నానీ రోల్ ఏంటీ అనే దానిపైనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో నానీ ఆర్మీ మేజర్ పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అవును ఆర్మీ మేజర్ పాత్రలో నానీ ఫ్లాష్ బ్యాక్  ఉంటుంది అని అంటున్నారు. అది చాలా పవర్ ఫుల్ పాత్ర అని టాక్. 

 

ఒక పోరాటం లో గాయపడిన తర్వాత నానీ వెనక్కు వచ్చేస్తాడు అని కుటుంబం ఒత్తిడి తో ఆర్మీ ఉద్యోగానికి అతను రాజీనామా చేస్తాడు అని సమాచారం. మరి నిజమా కాదా చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత ఈ సినిమాను ముందు విడుదల చేయడానికి గానూ నానీ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అతను రెండు తమిళ సినిమాల్లో చేసే అవకాశం ఉంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: