టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో జనాలకు ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. పెళ్లి చేసుకునే స్టార్ హీరోల గురించి జనాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా యువ హీరోలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అందులో రానా, నితిన్ ఇద్దరూ కూడా ఇప్పుడు తమ పెళ్లి గురించి జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ పెంచుతున్నారు. ఇక ఇదిలా ఉంటే  ఇప్పుడు నితిన్ పెళ్లి గురించే చర్చలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

 

ఇక అతను ఎప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని, అతను ఎవరిని పెళ్ళికి పిలుస్తాడు అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అతని పెళ్లి వచ్చే నెలలో జరుగుతుంది అని సమాచారం. హైదరాబాద్ లో అతని పెళ్లి ఉంటుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కేవలం కొద్ది మందిని మాత్రమే అతను ఆహ్వానిస్తున్నాడు అని తెలుస్తుంది. అందులో ప్రధానంగా... పవన్  కళ్యాణ్, త్రివిక్రమ్ తో పాటుగా, హారిక అండ్ హాసిని అధినేత రాధాకృష్ణ, తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఅర్ వంటి వారికి మాత్రమే ఆహ్వానాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. 

 

అలాగే తన మొదటి సినిమా విలన్ గోపి చంద్ ని కూడా పిలిచే అవకాశం ఉందని, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రానా సహా మరి కొందరికి ఆహ్వానాలు అందించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ పెళ్ళికి సంబంధించి ఆహ్వానాలను సిద్దం చేస్తున్నారు అని తెలుస్తుంది. కాగా అతను ఇప్పుడు రీమేక్ సినిమా చేస్తున్నాడు. అదే విధంగా తమిళ సినిమా ఒకటి రీమేకే చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక సినిమాను పవన్ తో కలిసి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: