కరోనా వైరస్ తో సతమతమవుతున్న తరుణంలో ఒక్కసారిగా బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా విషాద ఛాయలు అలుముకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ధోని బయోపిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.  అప్పటి నుంచి పోలీసులు విభిన్న కోణాల్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయనే దానిపైన విచారిస్తున్నారు.  అయితే రాజ్ పుత్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారు. పోస్ట్ మార్టం తరువాత ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విషయం వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. 

IHG

వ్యోమగామి కావాలన్న అంతిమ కలను సాకారం చేసుకోవడానికి పైలట్ కావడానికి సుశాంత్ శిక్షణ పొందాడు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో బ్లాక్ కలర్ నేషనల్ స్పేస్ యూనివర్సిటీకి చెందిన టీషర్ట్ ధరించినట్లు పోలీసులు నిర్ధారించారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక ఇండస్ట్రీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయా? అన్న కోణంలో విచారిస్తున్న పోలీసులు, యష్ రాజ్ ఫిల్మ్స్ లో కాస్టింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న షానూ శర్మను విచారించారు.  బాలీవుడ్ లోని కొందరు పెద్దలు సుశాంత్ కు అవకాశాలు లేకుండా చేశారని, ఈ కారణంతోనే డిప్రెషన్ లో కూరుకుపోయి సుశాంత్ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారంటూ, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

IHG

దీంతో పోలీసులు కేసును క్లోజ్ చేయకుండా విచారణ కొనసాగిస్తున్నారు. నేపథ్యంలో కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మను బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారించామని ముంబై డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. వివిధ నిర్మాణ సంస్థలకు చెందిన మరికొందరిని కూడా విచారించాలని నిర్ణయించామని, వారిని రాబోయే రోజుల్లో పిలిపించి మాట్లాడతామని తెలిపారు. యష్ రాజ్ ఫిల్మ్స్ లో సుశాంత్ నటిస్తున్న వేళ, షానూ అతనితో కలిసి 'శుద్ధ దేశీ రొమాన్స్', 'డిటెక్టివ్ బ్యోమ్ కేశ్ బాక్ షై' చిత్రాలకు పనిచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: