ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సరికొత్త సెన్సేషనల్ టైటిల్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అన్న టాక్ వినపడుతోంది. ఇప్పటికే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ దళితుడు ప్రణయ్ చనిపోయిన సంఘటన పై అమృత మరియు మారుతీ రావు పాత్రల ఆధారంగా మర్డర్ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన చిత్రీకరణ ఇంకా స్టార్ట్ అవ్వక ముందే తన నెక్స్ట్ సినిమా టైటిల్ అంటూ 'పవర్ స్టార్' అని ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది.

IHG

‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు… ఇందులో  PK, MS, NB, TS, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. ఇక ఈ సినిమాలోని పాత్రల గురించి అర్ధం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు మాత్రం ఇవ్వను’ అని RGV సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ ప్రకటన చేయగానే చాలామంది ఒక్కసారిగా షాక్ తిన్నారు.

IHG

రాబోయే రోజుల్లో ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’లో ఇంకెన్ని వెరైటీ సినిమాలు రామ్ గోపాల్ వర్మ తీస్తాడో అని టెన్షన్ పడుతున్నరు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ టైటిల్ టాగ్ పవన్ కళ్యాణ్ కి ఉండటంతో… ఆయన అభిమానులు కూడా సినిమా రామ్ గోపాల్ వర్మ ఏ ఉద్దేశంతో తీస్తున్నాడో అనే దాన్ని విషయంలో క్లారిటీ లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: